Breaking News

పంజాబ్‌లో 'ఆపరేషన్ లోటస్'.. 10 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఆఫర్‌

Published on Wed, 09/14/2022 - 15:20

సాక్షి, న్యూఢిల్లీ: గోవాలో 8 మంది కాంగ్రెస్‌ ఎ‍మ్మెల్యేలు బీజేపీలో చేరిన రోజే సంచలన ఆరోపణలు చేశారు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్‌లోనూ 'ఆపరేషన్ లోటస్‌' ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ సంప్రదింపులు జరిపిందని బుధవారం తెలిపారు.

దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదన్నారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పంజాబ్, ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ విజయవంతం కాదని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు.

బీజేపీ సంప్రదింపులు జరిపిన ఆప్ ఎమ్మెల్యేల పేర్లను పంజాబ్ మంత్రి హర్పాల్ చీమ వెల్లడించారు. దినేష్ చద్దా, రమణ్ అరోడా, బుధ్ రామ్, కుల్వాంత్ పండోరి, నరీందర్ కౌర్ భరాజ్, రాజ్నీశ్ దహియా, రూపిందర్ సింగ్ హప్పీ, శీతల్ అంగురాల్, మంజీత్ సింగ్ బిలాస్‌పుర్, లాభ్ సింగ్ ఉగోకే, బలీందర్ కౌర్‌లకు బీజేపీ ఫోన్ చేసిందని తెలిపారు. ఫోన్‌ కాల్స్ ఆధారంగా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ ఇదివరకే ఆరోపించిన విషయం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20-25 కోట్ల వరకూ ఇస్తామని కమలం పార్టీ ప్రలోభ పెట్టిందని పేర్కొన్నారు. ఆ వారంలోనే ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తమ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగరని, బీజేపీ ప్రయత్నాలు ఫలించవని చెప్పారు.
చదవండి: బీజేపీ ప్లాన్‌ సక్సెస్‌.. గోవాలో కాంగ్రెస్‌ ఖాళీ!

Videos

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

మరోసారి వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత

త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)