Breaking News

ప్రస్తుతం జమిలి ఎన్నికలు అసాధ్యం: చిదంబరం కీలక వ్యాఖ్యలు

Published on Mon, 09/16/2024 - 17:01

న్యూడిల్లీ: ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ మొదలవుతుందన్న ప్రచారంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం స్పందించారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ సాధ్యం కాదని, అందుకోసం కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని తెలిపారు.

సోమవారం ఆయన చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఐదు రాజ్యాంగం సవరణలు చేయాలని వాటిని లోక్ సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు మోదీకి మెజారిటీ సంఖ్య లేదని అన్నారు. ఈ ప్రతిపాదనను అమలు చేయాలంటే రాజ్యాంగపరమైన అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయని నొక్కి చెప్పారు. జమిలీ ఎన్నికలు అసాధ్యమని, ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.

అయితే రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందంటూ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ప్రధాని మాటలకు ఖండించారు.  తాము ఎన్నో ఏళ్లుగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాము. వాటిని ఎందుకు రద్దు చేయాలని కోరుకుంటామని అన్నారు. తాము కేవలం 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలని మాత్రమే చెబుతున్నామని తెలిపారు. కుల గణన కోరేది మేమే.. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్నాం.. ప్రధాని చెప్పేవన్నీ నమ్మొద్దు’ అని వెల్లడించారు.

ఇదిలా ఉండగా గత నెలలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలపై గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నుంచి బయట పడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Videos

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం