Breaking News

నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి

Published on Thu, 05/02/2024 - 14:51

శ్రీనగర్: లోక్‌సభ 2024 ఎన్నికలు ఇప్పటికి రెండు దశల్లో పూర్తయింది. ఈనెల 7న మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు, ఐదో దశల్లో  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే కాకుండా.. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ జరగనుంది. ఈ తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ 'ఒమర్ అబ్దుల్లా' జమ్మూ కాశ్మీలోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.

నేషనల్ కాన్ఫరెన్స్ ట్రెజరర్ షమ్మీ ఒబెరాయ్, జమ్మూ & కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జీఎన్ మోంగాతో పాటు ఒమర్ అబ్దుల్లా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈయన పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజాద్ లోన్‌తో పోటీపడనున్నట్లు తెలుస్తోంది. పీడీపీ ఈ స్థానం నుంచి రాజ్యసభ మాజీ ఎంపీ మీర్ ఫయాజ్‌ను బరిలోకి దింపింది.

నామినేషన్ వేయడానికి మే 3 చివరి తేదీ. కాగా మే 20న పోలింగ్ జరగనుంది. బారాముల్లాలో విలేకరులతో మాట్లాడుతూ.. పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంటే.. తాను తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటానని చెప్పారు.

నేషనల్ కాన్ఫరెన్స్  ఉపాధ్యక్షుడైన ఒమర్‌ అబ్దుల్లా 2009 తర్వాత తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా దక్కే వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన ప్రమాణం చేశారు. దీంతో సుమారు 20 సంవత్సరాల తరువాత మళ్ళీ లోక్‌సభ ఎన్నికల బరిలో అడుగుపెట్టారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)