Breaking News

‘ఇలాంటి డ్రామాలు చేస్తే.. కేసీఆర్‌కు తెలంగాణలో ఓటమి ఖాయం’

Published on Tue, 06/27/2023 - 12:21

ముంబై: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనతో రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్‌ పర్యటన ఇక్కడి రాజకీయాలపై ప్రభావం చూపదని శివసేన ఉద్ధవ్ ఠాక్రే పక్షనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ కూడా పోతుందని, ఆయన ఓటమి భయంతో ప్రస్తుతం మహారాష్ట్రలో అడుగుపెట్టారని ధ్వజమెత్తారు.

మరో వైపు బీఆర్‌ఎస్‌ నేతలు 12 నుంచి 13 మంది కాంగ్రెస్‌లో చేరారని రౌత్ అన్నారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి బలంగా ఉందన్నారు.  ఇదిలా ఉండగా .. బీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్‌... జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆయన సభ నిర్వహించి, బీజేపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, శివసేనపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

కాగా.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు బీఆర్‌ఎస్ నేతలు సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.  తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కుస్తీపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కర్ణాటకలో ఎన్నికల్లో విజయం సాధించడంతో జోష్‌లో ఉన్న ఆ పార్టీకి తాజాగా ముఖ్య నేతలు టీకాంగ్రెస్‌లోకి చేరడం కలిసొచ్చే అంశమనే చెప్పాలి.

చదవండి: టీడీపీ-జనసేన.. భయం భయంగానే సహజీవన రాజకీయం!

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)