Breaking News

రాజ్యాంగంపై చర్చ.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన నిర్మలా సీతారామన్‌

Published on Mon, 12/16/2024 - 12:30

ఢిల్లీ: రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సమయంలో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శలు గుప్పించారు.  పౌర హక్కులను పరిమితం చేయడానికి కాంగ్రెస్‌ పదే పదే రాజ్యాంగాన్ని సవరించిందని ఆరోపించారు.

రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ‘గత ఏడు దశాబ్దాలలో మన రాజ్యాంగంలో అనేక సవరణలు జరిగాయి. నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో రాజ్యాంగంలో వాక్ స్వాతంత్య్రాన్ని అరికట్టేలా మొదటి సవరణ జరిగింది. మీడియా సంస్థలు ముఖ్యంగా రాజకీయంతో సంబంధం ఉన్న కీలక అంశాలపై లోతుగా విచారణ జరపరడాన్ని నెహ్రూ వ్యతిరేకించారని, పత్రికా స్వాతంత్య్రాన్ని తగ్గించేందుకు రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడాదిలోపే రాజ్యాంగాన్ని సవరించారని పేర్కొన్నారు.

 

గత వారం లోక్‌సభలో రెండు రోజులపాటు జరిగిన వాడివేడి చర్చల తర్వాత ఇవాళ సీతారామన్ రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించారు . ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చ జరిగింది.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు కీలక డిమాండ్‌ చేశాయి. దీంతో పాటు అదానీ వివాదం, జార్జ్ సోరోస్ ఆరోపణలు , ఉపరాష్ట్రపతి,రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు వంటి అంశాలు ఉభయ సభల్లో గందరగోళానికి దారి తీశాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)