Breaking News

జమ్ము కశ్మీర్‌: ‘ఆమె మద్దతిస్తే.. తీసుకుంటాం’

Published on Mon, 10/07/2024 - 16:16

శ్రీనగర్‌:  జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఫలితాలు హంగ్‌ దిశగా వెలువడతాయని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ నేత ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకున్నా పీడీపీ మద్దతు ఇస్తానంటే తాము అంగీకరిస్తామని తెలిపారు. 

ఇప్పటికే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి మద్దతు ఇచ్చేందుకు మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సిద్ధంగా ఉందని వస్తు​న్న వార్తలపై సోమవారం ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.

‘‘జమ్ము కశ్మీర్‌లో  ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకపోయినా మద్దతు ఇస్తానంటే తీసుకుంటాం. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు మనమందరం కృషి చేయాలి. జమ్ము కశ్మీర్‌ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అయితే ఎన్నికల తర్వాత పొత్తుపై నేను మెహబూబా ముఫ్తీతో మాట్లాడలేదు. నేను ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

 

..మేమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాం. అయితే ప్రస్తుతానికి నేను ముఫ్తీతో మాట్లాడలేదు. ఆమె మద్దతు ఇస్తానన్న విషయాన్ని పేపర్లలో మాత్రమే చదివాను. ఎగ్జిట్ పోల్స్‌ గురించి నేను ఉత్సాహంగా లేను. ఎందుకంటే అవి సరైనవి కావోచ్చు. తప్పు కూడా కావచ్చు. ఓట్ల లెక్కింపు తర్వాత అసలు నిజం వెల్లడి అవుతుంది. కాంగ్రెస్‌- నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం. మా ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.

చదవండి: హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)