Breaking News

దటీజ్‌ నవీన్‌ పట్నాయక్‌

Published on Wed, 06/19/2024 - 07:14

నవీన్‌ పట్నాయక్‌.. దేశంలో సుదీర్ఘకాలం(24 ఏళ్లపాటు) ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. రాజకీయాల్లో మృదుస్వభావిగా ఆయనకంటూ ఓ ట్యాగ్‌లైన్‌ ఉంది. అలాగే.. మెచ్యూర్డ్‌ స్టేట్స్‌మన్‌గా వాజ్‌పేయి లాంటి రాజకీయ ఉద్ధండులతో ప్రశంసలు అందుకున్నారాయన. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయినప్పటికీ.. ఒడిశాలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం నెలకొల్పుతూ మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారాయన.

తాజాగా ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి వెళ్లారు.  ఆ సమయంలో ఆయన రాకను గమనించి.. సీఎం మోహన్‌ మాఝి సహా ఎమ్మెల్యేలంతా లేచి నిలబడ్డారు. వాళ్లందరికీ నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్లబోయారు. ఆ సమయంలో కంటాబంజి ఎమ్మెల్యే లక్ష్మణ్‌ బాగ్‌ లేచి నిలబడి తనను తాను పరిచయం చేసుకున్నారు. అది చూసి.. ‘‘మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు’’ అని నవీన్‌ అన్నారు. దీంతో అక్కడున్న వాళ్లంతా చిరునవ్వులు చిందించారు.

ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల(గంజాం జిల్లాలోని హింజలి, బొలంగీర్‌ జిల్లాలోని కంటాబంజి)నుంచి నవీన్‌ పట్నాయక్‌ పోటీ చేశారు. అయితే కంటాబంజిలో భాజపా అభ్యర్థి లక్ష్మణ్‌ బాగ్‌ చేతిలో ఓడిపోయారు. హింజలిలో గెలిచిన ఆయన మంగళవారం ప్రమాణస్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు.

 

 ఇదే కాదు.. సీఎంగా మోహన్‌ మాఝి ప్రమాణ స్వీకారానికి నవీన్‌ పట్నాయక్‌ హాజరై ఆశీర్వదించిన తీరు రాజకీయ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది కూడా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనేది ఒక మాట. అలాగే.. ఫ్రెండ్లీ పాలిటిక్స్‌ ఎలా ఉండాలో నవీన్‌ను చూసి నేర్చుకోవాలన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)