Breaking News

మున్సిపల్‌ ఎన్నికలు.. 14 వార్డుల్లో ఏకగ్రీవం

Published on Wed, 02/04/2026 - 12:59

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకగ్రీవ ఫలితాలు వెల్లడవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 వార్డుల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. అధికంగా కాంగ్రెస్ ఖాతాలోకి ఏకగ్రీవ వార్డులు చేరాయి. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఉమ్మడి నల్లగొండలోని సూర్యాపేలో ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయి.

వివరాల ప్రకారం.. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో 14 వార్డుల్లో అ‍భ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు 12 చోట్ల ఏకగ్రీవం కాగా.. బీఆర్‌ఎస్‌ నుంచి రెండు వార్డుల్లో ఏకగ్రీవ విజయం అందుకున్నారు. సూర్యాపేట జిల్లాలో అత్యధిక ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయి. కొడాదలో మూడు వార్డులు ఏకగ్రీవం కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు ఏకగ్రీవ ఫలితాలు, వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చెరో విజయం దక్కింది. అలాగే, మహబూబ్‌నగర్, మెదక్, పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మహిళా అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఏకగ్రీవ విజయం అందుతున్నాయి.

వివరాలు ఇలా.. 

  • జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ మున్సిపాలిటీ వార్డు–10 (ST జనరల్)లో పీ.విక్రమ్ (BRS) ఏకగ్రీవ విజయం

  • యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ వార్డు–17 (SC మహిళ)లో చింతల ఉమామహేశ్వరి (కాంగ్రెస్) ఏకగ్రీవ ఎన్నిక

  • ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ వార్డు–15 (UR మహిళ)లో తమ్మినేని మంగతాయి (కాంగ్రెస్) విజయం

  • నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ వార్డు–10 (BC మహిళ)లో చంద్రకళ పిల్లి (కాంగ్రెస్) ఏకగ్రీవ గెలుపు

  • సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మున్సిపాలిటీ వార్డు–3 (BC మహిళ)లో సులావ నాగలక్ష్మి (కాంగ్రెస్) ఏకగ్రీవ విజయం

  • సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–11 (UR మహిళ)లో దేవరపల్లి మల్లేశ్వరి (కాంగ్రెస్) ఎన్నిక

  • సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–21 (BC మహిళ)లో కట్టెబోయిన జ్యోతి (కాంగ్రెస్) గెలుపు

  • సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–31 (UR మహిళ)లో యెర్నేని కుసుమ కుమారి (కాంగ్రెస్) ఏకగ్రీవ విజయం

  • మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు–58 (UR మహిళ)లో బి.రమాదేవి (కాంగ్రెస్) ఎన్నిక

  • మెదక్ జిల్లా మెదక్ మున్సిపాలిటీ వార్డు–32 (UR మహిళ)లో గోదల మానస (కాంగ్రెస్) గెలుపు

  • పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు–1 (UR మహిళ)లో మడిపెల్లి విజయ (కాంగ్రెస్) విజయం

  • వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు–1 (UR జనరల్)లో అనంత్ రెడ్డి పటోల్ల (కాంగ్రెస్) ఏకగ్రీవ ఎన్నిక

  • వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు–15 (SC జనరల్)లో పీ.విజయలక్ష్మి (BRS) విజయం

  • యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ వార్డు–10 (BC మహిళ)లో గుండ్లపల్లి వాణి (కాంగ్రెస్) ఏకగ్రీవ గెలుపు

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)