Breaking News

చంద్రబాబు బాగు కోసమే పవన్‌ పార్టీ

Published on Sun, 04/07/2024 - 04:30

తణుకు అర్బన్‌: చంద్రబాబు బాగుకోసమే పవన్‌­కళ్యాణ్‌ పార్టీ పెట్టారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. చంద్ర­బాబు ఎస్టేట్‌కు పవన్‌ కళ్యాణ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కమ్మ కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన తణుకు నియోజకవర్గ కాపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాపు ఉద్యమాన్ని తప్పుపడుతున్న పవన్‌ కాపులకు ఏం చేశారని నిలదీశారు. ప్రజలను డబ్బులకు అమ్ముడుపోయే వారిలా చిత్రీకరిస్తూ పిఠాపురంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటుకు రూ.లక్ష ఇచ్చి తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారనడం బాధాకరమన్నారు.

‘క్లబ్బులు నడిపే వారితో సోషల్‌ మీడియాలో నన్ను తిట్టిస్తున్నావు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రెస్‌మీట్‌ ద్వారా నేరుగా నన్ను తిట్టవచ్చు. అప్పుడు నేనేంటో నీకు చూపిస్తా’ అంటూ ముద్రగడ సవాల్‌ విసిరారు. 21 అసెంబ్లీ సీట్లకు పరిమితమై త్యాగపురుషుడిగా కీర్తి సాధించా­వంటూ ఎద్దేవా చేశారు. వాటిలో కూడా టీడీపీ నుంచి­జనసేనకు వచ్చినవారి సంఖ్యే అధికమని తెలి­పారు. ముద్రగడ భార్య చనిపోయిందని, కొడుకు చనిపోయాడని నీచాతి నీచంగా పోస్టులు పెట్టిస్తున్న నిన్ను చూస్తుంటే అసహ్యమేస్తోందని చెప్పారు. నీచాతినీచంగా నాణ్యమైన లిక్కర్‌ ఇస్తామంటూ రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చారని విమర్శించారు. 

పవన్‌ను ఇంటికి పంపించండి
ఈ ఎన్నికల్లో పవన్‌ను రాజకీయంగా ప్యాక్‌ చేసి ఇంటికి పంపించాలని కాపు నాయకులకు ముద్రగడ పిలుపునిచ్చారు. పేదల పెన్నిధిగా నిలబడ్డ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి అండగా నిల­బడతామని, జగన్‌ చేసిన మంచే ఆయనకు రక్షగా ఉంటుందని చెప్పారు. ఒక ముఖ్యమంత్రిని నిన్ను తొక్కేస్తా అంటూ ఊగిపోవడం, ఉక్రోషంగా, ఉద్రే­కంగా మాట్లాడే పవన్‌ తీరు ఏ రాజకీయ నాయకు­డికీ లేదని, రాజకీయాల్లో గౌరవప్రదమైన భాష వాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. సమా­వేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, నర­సా­పురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)