ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్‌

Published on Fri, 11/15/2024 - 20:31

సాక్షి, తాడేపల్లి: 'ఆంధ్రజ్యోతి'కి ఉత్తమ జర్నలిస్ట్‌ సాంప్రదాయాలు పాటించమని, మా స్పందన కూడా ప్రసారం చెయ్యాలని చెప్పా.. నువ్వు అసలు చిత్తశుద్ధి కలిగిన వృత్తిపరమైన పాత్రికేయుడివేనా? అంటూ ఎక్స్‌ వేదికగా ఏబీఎన్‌ రాధాకృష్ణను వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

‘‘నన్ను 2012లో సీబిఐ అరెస్ట్ చేసినప్పుడు మా ఇల్లు, ఆఫీస్ రైడ్ చేసి ఫైల్స్, అన్నిపత్రాలు స్వాధీనం చేసుకుని పూర్తిస్థాయి విచారణ జరిపారు. 12 నెలలు, కాంగ్రెస్-టీడీపీ కుట్రలో భాగంగా, జైల్లో గడిపాను. "ఆదాయానికి మించి ఆస్తులు" అభియోగాలు లేవు. నా పైన పెట్టిన సెక్షన్లు కుట్ర, ప్రేరేపణ, ఖాతా లెక్కల ఫడ్జింగ్ మాత్రమే. నీలాగ మోసగాడినో, దోపిడీదారునో, బ్లాక్ మైలర్ నో, వీలర్ డీలర్ నో కాదు. గుర్తుంచుకో!’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

..నీలాగా మద్యం సిండికేట్ బ్రోకర్ల దగ్గర, ఖనిజాల సిండికేట్ బ్రోకర్ల దగ్గర ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి వారికీ ఇవ్వాలని నెల నెలా కోట్లకు కోట్లు నేను తీసుకోలేదు. ఇప్పుడు 2024లో విజయసాయి రెడ్డి అనే నేను నువ్వు చెప్పే భూదందాలు, భూముల ఆక్రమణలు పై సిబిఐ, ఈడీ విచారణకు సిద్ధం. నువ్వు సిద్ధమేనా వేమూరి రాధాకృష్ణా? ఇద్దరం కలసి జాయింట్‌గా కేంద్రవిచారణా సంస్థలకు విచారణకు పిటిషన్ పెట్టుకుందాం! సిద్ధమా!. సాధారణ విలేకరిగా ఇంత సంపద పోగేసుకున్నావ్, సీఏ చదివిన ఆడిటర్‌గా ప్రాక్టీసుతో ఈ స్థాయికి నేను వచ్చాను. ఎవరెలా సంపాదించారో తెలుగు ప్రాంతాల బయట నాతో చర్చకు సిద్ధమా? రాధాకృష్ణా’’ అంటూ విజయసాయిరెడ్డి సవాల్‌ విసిరారు.

 

‘‘22 ఏళ్ల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రికను సాధారణ విలేకరివి అయినా రాధాకృష్ణ.. ఆంధ్రజ్యోతి స్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎల్ ఎన్ ప్రసాద్ వారసుల నుంచి సొంతం చేసుకుని 2002 అక్టోబర్‌లో మొదలెట్టి కొద్ది సంవత్సరాల్లోనే దాదాపు 20 ఎడిషన్లు పెట్టేస్థాయికి ఎదిగింది. నూజివీడు సీడ్స్‌ యజమాని మండవ ప్రభాకర రావు, విజై ఎలెక్ట్రికల్స్‌ నాటి యజమాని దాసరి జై రమేష్‌ వంటి పారిశ్రామికవేత్తలకు వాటాలు ఉన్నట్టు చెప్పి మరెందరో రహస్య పెట్టుబడిదారులను మోసం చేసి నువ్వు ఈ పత్రికను వేలాది కోట్ల రూపాయల సంపదగా దాన్ని మార్చుకున్న తీరు తెలుగునేలనే అపూర్వం. అనితర సాధ్యం’’ అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. 

ఇదీ చదవండి: కూటమికి కళ్లు నెత్తికెక్కాయి.. ఏపీ బీజేపీలో తిరుగుబాటు స్వరం

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)