Breaking News

రెడ్‌బుక్‌కు వైఎస్సార్‌సీపీ కేడర్‌ భయపడేది లేదు: గురుమూర్తి

Published on Mon, 04/14/2025 - 12:44

సాక్షి, నెల్లూరు: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పీక్‌ స్టేజ్‌కు చేరుకుందన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి. అక్రమ కేసులు, నిర్భందాలకు వైఎస్సార్‌సీపీ కేడర్‌ భయపడే రోజులు పోయాయని హెచ్చరించారు. అలాగే, ఏపీలో పరిశ్రమలు మూతపడటానికి ప్రభుత్వ సంస్కరణలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్క్‌ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరీగ మురళీధర్, నియోజకవర్గ ఇంచార్జులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..‘అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించే నైతిక హక్కు టీడీపీకి లేదు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని టీడీపీ నేతలు అమలు చేస్తున్నారు.

ఏపీలో కక్ష సాధింపు చర్యల వల్ల ఊర్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేధావులు, విద్యావంతులు వ్యతిరేకించాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా మాజీ మంత్రి కాకాణిపై అక్రమ కేసులు పెట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే.. గిరిజనులను బెదిరించి.. కాకాణి మీద SC, ST కేసు పెట్టించారు. న్యాయస్థానాల మీద నమ్మకం వుంది కాబట్టే మాజీ మంత్రి కాకాణి కోర్టును ఆశ్రయించారు. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మైనింగ్ చేస్తూ.. రాష్ట్ర ఖజానాకి గండి కొడుతున్నారు. ఏపీలో పరిశ్రమలు మూతపడటానికి ప్రభుత్వ  సంస్కరణలే కారణం. అక్రమ కేసులు, నిర్భందాలకు వైఎస్సార్‌సీపీ కేడర్‌ భయపడే రోజులు పోయాయి. గోవుల మృతిపై భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినవి అన్నీ వాస్తవాలే. అఖిల పక్షాన్ని తీసుకెళ్లి గోశాలను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలి. టీటీడీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి’ అని కామెంట్స్‌ చేశారు. 

కాకాణి అక్రమ కేసులపై గురుమూర్తి సీరియస్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)