Breaking News

ఇదే మీ చేతగానితనానికి నిదర్శనం: అవినాష్‌రెడ్డి

Published on Sat, 12/14/2024 - 19:55

వైఎస్ఆర్ జిల్లా:  సాగునీటి సంఘాల ఎన్నికలను పోలీసుల్ని అడ్డుపెట్టుకుని నిర్వహించడం కూటమి ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శమని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి విమర్శించారు. సాగునీటి సంఘాల ఎన్నికల సందర్భంగా బీటెక్‌ రవి చేసిన వ్యాఖ్యలపై అవినాష్‌రెడ్డి మండిపడ్డారు.

‘బీటెక్‌ రవి మాటలు సినిమాను తలపిస్తున్నాయి. సినిమా డైరెక్టర్‌  నిర్మాత, ప్రేక్షకుడు అన్నీ ఆయనే, ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. అప్రజాస్వామికంగా సాగునీటి ఎన్నికలు జరిగాయి. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికలు చేయడం చేతకానితనం. ఎన్నికల్లో రైతులు పోటీ చేయాలంటే, నో డ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఎన్నికలు కోరుకునే వారైతే.. ప్రతి రైతుకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండేది. 

వీఆర్‌ఓలను అందుబాటులో పెట్టకుండా అందరిని ఎమ్మార్వో కార్యాలయంలో దాచారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే బీటెక్‌ రవి చొక్కా విప్పేవారు రైతులు. ఖైదీలను బంధించినట్లు వీఆర్‌ఓలను ఎమ్మార్వో కార్యాలయంలో ఎందుకు బంధించారు. రైతులు మీకు ఎందుకు ఓటేస్తారు?,  ఈ క్రాఫ్ విధానం రద్దు చేస్తామన్నారు మరి ఎందుకు రద్దు చేయలేదు?, రైతులకు నో డ్యూస్ ఇవ్వకుండా అడ్డుకున్న దద్దమ్మవి నీవు. జమ్మలమడుగులో వీఆర్‌ఓలను  దేవగుడిలో బంధించినది వాస్తవం కాదా?.’అని  విమర్శల వర్షం కురిపించారు. 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)