Breaking News

బీఆర్‌ఎస్‌, బీజేపీ విలీనం ఎప్పటికీ జరగదు: ఎంపీ అర్వింద్‌

Published on Fri, 08/23/2024 - 15:23

సాక్షి,నిజామాబాద్: బీఆర్‌ఎస్‌ బీజేపీలో ఎప్పటికీ విలీనం కాదని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ స్పష్టం చేశారు. ఇది కొందరు చేస్తున్న ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. శుక్రవారం(ఆగస్టు23) అర్వింద్‌ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, కవితను బీజేపీ ఎప్పటికీ దగ్గరకు రానివ్వదని చెప్పారు.

తనకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నాందేడ్ జిల్లా ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ‘బీజేపీ సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడే వారిని, పార్టీని గెలిపించేవారినే రాష్ట్ర బీజేపీ అధ్యకుడిగా ఎంపికచేయాలి. పార్టీ అభ్యర్థులను ఎన్నికలలో గెలిపించే సత్తా ఉన్నవారికి నాయకత్వ భాధ్యతలను అప్పగించాలి. 

రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది. సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ఏమయ్యాడో అందరికీ తెలుసు. కేసీఆర్‌కు రేవంత్ కు తేడా లేదని ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. రుణమాఫీలో పనికిమాలిన కండిషన్లు పెట్టి రైతులను దగా చేశారు. సంపూర్ణ రుణమాఫీ కోసం రేపు రైతు సంఘాలు రైతులు ఆర్మూరులో చేపడుతున్న మహాధర్నాకు బీజేపీ మద్దతు ఇస్తుంది’అని అర్వింద్‌ తెలిపారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)