Breaking News

AP: రాష్ట్రంలో అల్లర్లకు లోకేశ్‌ కుట్ర

Published on Sun, 08/27/2023 - 04:07

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేలా టీడీపీ శ్రేణులను ప్రేరేపిస్తూ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను దుర్భాషలాడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్, ఆ పార్టీకి చెందిన ఇతర నేత­లపై శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులందాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు, పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్లు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు ఈ ఫిర్యాదులు చేశారు. సమాజంలో అశాంతి కలిగేలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు, లోకేశ్, ఇతర నేతలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లర్లకు నారా లోకేశ్‌ కుట్ర చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌ రెడ్డి శనివారం విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విశాఖ జిల్లా కో కన్వీనర్‌ సదరం జ్ఞానేష్, ఉత్తర నియోజకవర్గం కన్వీనర్‌ అనిల్‌ శర్మ తదితరులతో కలిసి ఆయన విశాఖపట్నం ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా సోషల్‌ మీడియా కన్వీనర్‌ తిప్పల వంశీరెడ్డి గాజువాక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా కోటవురట్లలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా మండల కన్వీనర్‌ కొల్లు గోపాలకృష్ణ తదితరులు ఫిర్యాదు చేశారు.

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ కొప్పుల ప్రభాకరరెడ్డి, కో కన్వీనర్లు డెక్కత జయరాంరెడ్డి, కొమ్మన అనిల్‌ తదితరులు ఏలూరు వన్‌టౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ద్వారకా తిరుమల మండల సోషల్‌ మీడియా ప్రతినిధులు ద్వారకా తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో నాలుగు రోజుల్లో లోకేశ్‌ పాదయాత్ర నల్లజర్ల మండలం చేరుకుంటుందని, అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా ఏలూరు జిల్లా కోకన్వీనర్‌ సైదం సురేష్‌ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు దెందులూరు, పెదపా­డు, పెదవేగి, ఏలూరు రూరల్‌ మండల పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. టి.నర్సా­పురం పోలీసులకు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ శ్రీను రాజు, ఎంపీపీ దారబోయిన లక్ష్మీ వెంకటేశ్వరరావు, సహకార సంఘ చైర్మన్, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, వైఎస్సార్‌సీపీ యూత్‌ మండల నాయకుడు కన్నం సర్వేశ్వరరావు ఫిర్యాదు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పోలీసులకు వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియాకు చెందిన బాకూరు సత్యనిరంజన్, ఉచ్చుల స్టాలిన్, కుక్కల బాలచందర్‌ తదిత­రులు ఫిర్యాదు చేశారు. కుక్కునూరు సీఐ సత్య­నారాయణకు మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌ మల్లెల చంటినాయుడు ఆధ్వర్యంలో పలువురు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, అయ్యన్న­పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ పిల్లి వెంకట్‌ ఆధ్వర్యంలో విజయవాడ పటమట సీఐ కాశీవిశ్వనాథ్‌కు ఫిర్యాదు చేశారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)