Breaking News

జీవీఎంసీ ఎన్నికల్లో మొల్లి లక్ష్మి హ్యాట్రిక్‌ విజయం..

Published on Wed, 11/04/2026 - 14:12

విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 19వ వార్డు అభ్యర్థి మొల్లి లక్ష్మి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. 2007, 2023, 2026లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సమీప టీడీపీ అభ్యర్థి గుడ్ల విజయసాయిపై 98 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో వరుసగా మూడోసారి విజయం సాధించిన ఘనత దక్కించుకున్నారు. 

మొల్లి లక్ష్మి తొలిసారిగా 2007 జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 850 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థిపై 1,250 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తాజాగా 2026 ఎన్నికల్లోనూ విజయం సాధించి వరుసగా మూడు జీవీఎంసీ ఎన్నికల్లో గెలిచిన రికార్డును నమోదు చేశారు. 

మొల్లి లక్ష్మికి అభినందనలు 
జీవీఎంసీ ఎన్నికల్లో 19వ వార్డు నుంచి మొల్లి లక్ష్మి అప్పారావు విజయం సాధించిన సందర్భంగా  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధించడంపై అభినందనలు వ్యక్తం చేశారు.

 కార్యక్రమంలో 18వ వార్డు అధ్యక్షుడు కణితి మరియుదాస్, ఉపాధ్యక్షుడు బుగత యేసురత్నం, మహిళా అధ్యక్షురాలు అర్జీ వెంకట్‌ లక్ష్మి, బీసీ సెల్‌ అధ్యక్షుడు వేగి వెంకట్రావు, ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ కరిముల్లా, వార్డు స్టూడెంట్‌ వింగ్‌ అర్జీ తరుణ్, వార్డు కార్యదర్శి కాళ్లపులి రాజు, వార్డు సీనియర్‌ నాయకులు గొటివాడ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.   

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)