‘జూబ్లీహిల్స్‌’ ఉప ఎన్నిక.. విజయశాంతి సంచలన ఆరోపణ!

Published on Tue, 10/07/2025 - 07:03

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌(Jubilee Hills by-election) ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని తేలడంతో బీఆర్‌ఎస్‌(BRS Party) పార్టీ అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి(Vijaya Shanthi) ఆరోపించారు. ‘జూబ్లీహిల్స్‌ ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తున్న కారణంగా మిత్ర ధర్మం కోసం ఈ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగుతున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. 

బీజేపీ(BJP) డమ్మీ అభ్యర్థిని బరిలోకిదింపి తన రహస్య మిత్రపక్షమైన బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పైకి బీజేపీకి మద్దతిస్తున్నట్టు టీడీపీ ప్రకటించినా, రహస్యంగా బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయాలని సందేశం పంపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బతీయాలనే కుట్రతో టీడీపీ మద్దతు బీఆర్‌ఎస్‌కు లభించే విధంగా బీజేపీ రహస్య అవగాహన కుదిర్చినట్టు సమాచారం. బీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీల అవకాశవాద రాజకీయాన్ని జూబ్లీహిల్స్‌ ఓటర్లకు వివరించే బాధ్యతను స్థానికంగా ఉన్న ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త తీసుకోవాలని కోరుతున్నాను’అని సోమవారం విజయశాంతి ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చారు. 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)