‘జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను సస్పెండ్‌ చేయాలి’

Published on Tue, 01/27/2026 - 17:30

సాక్షి,తాడేపల్లి: మహిళపై దారుణానికి ఒడిగట్టిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 

రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. రాష్ట్రంలో కూటమి‌ ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ లేదు. మహిళలపై బరి తెగించి మృగాలుగా వ్యవహరిస్తున్నారు. మహిళల జీవితాలతో అడుకుంటున్నారు. తప్పు చేస్తే శిక్షిస్తారనే భయం లేకుండా పోయింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశాడు.

అతనిపై ఇంకా ఎందుకు కేసులు పెట్టలేదు?. తప్పుడు పనులు చేసే వారికే ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. రాప్తాడులో పద్నాలు మంది  టీడీపీ కార్యకర్తలు లైంగిక దాడి చేస్తే కేసు లేదు. కిరణ్ రాయల్ అనే జనసేన నేత లక్ష్మి అనే మహిళ జీవితాన్ని రోడ్డున పడేశాడు. కోట వినూత మీద టీడీపీ ఎమ్మెల్యే స్పై చేస్తే చర్యలు లేవు. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస రావు వలన మహిళా వీఆర్వోపై దాడి  చేసినా చర్యలు లేవు.

ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళకు ఐదుసార్లు అబార్షన్ చేయించాడు. లొంగక పోతే ఆమె కొడుకుని చంపుతానని బెదిరించాడు. పవన్ కళ్యాణ్ కనీసం ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా?. మహిళపై చేయి వేస్తే అదే చివరి రోజు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు?. మహిళా హోంమంత్రి అనితకు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కనపడటం లేదా?. మంత్రి సంధ్యారాణి  పీఏ మహిళను అన్యాయం చేస్తే తిరిగి బాధితురాలి మీదే కేసు పెట్టారు

అధికారమదంతో ఉన్న ఇలాంటి వారి వల్ల మహిళలకు రక్షణ ఉంటుందా?. అసలు రాష్ట్రంలో మహళా కమిషన్ ఏం చేస్తోంది?. సుమోటోగా ఎందుకు కేసు పెట్టలేదు?.బలహీనతలు ఉంటే బయటకు రానీయవద్దని ప్రకటన చేసిన పార్టీ జనసేన. తప్పులు చేయవద్దని చెప్పకుండా వీడియోలు బయటకు రానీయవద్దన్న ఏకైక పార్టీ జనసేన’అని మండి పడ్డారు. 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)