Breaking News

‘దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా?’

Published on Fri, 08/08/2025 - 18:43

తాడేపల్లి:  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల అంఃశానికి సంబంధించి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని  ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఈ రోజు(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ప్రజలను భయపెట్టి ఎన్నికలకు రాకుండా చేసి గెలవాలని చూస్తున్నారు.రెవిన్యూ యంత్రాంగం నిస్సిగ్గుగా టీడీపీ కోసం పని చేస్తుంది. దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా?, రెండు దశాబ్దాల క్రితం బిహార్‌లో ఉన్న పరిస్తితి టీడీపీ ప్రభుత్వం ఏపీలో తీసుకు వచ్చింది. కొంతమంది అధికారులు మితి మీరిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. 

వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. పులివెందుల ఎన్నికలతోనే రాష్ట్ర రాజకీయాలు తారుమారు అవుతాయా?, ఆరు పోలింగ్ కేంద్రాలను మార్చేశారు.ప్రజలు ఓటు వేయాలి అనుకుంటున్నారా?, ఓటు వేయొద్దు అనుకుంటున్నారా?, మీరు ఎవరు ఓటుకు రావాల్సిన అవసరం లేదనే దురహంకారంతో మార్చారు. ప్రజా స్వామ్య బద్దంగా పులివెందుల ఎన్నిక నిర్వహించండి. ప్రజలు ఎవరి పక్షంగా ఉన్నారో తెలుస్తుంది. నిజంగా టిడిపి గెలిచే పరిస్తితి ఉంటే ఈ దాడులు ఏంటి?, రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు సునీత బయటకు వస్తారు. ప్రభుత్వాన్ని కాపాడటానికి మాట్లాడతారు. చంద్రబాబు మీ నాయకుడే కదా...ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది. ఇంకా అధికారులను కలవడం ఎందుకు?’ అని ప్రశ్నించారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)