డీకేతో రేవంత్‌ భేటీపై కవిత ఫైర్‌

Published on Sat, 09/02/2023 - 11:23

అసెంబ్లీ ఎన్నికల మందు తెలంగాణ  రాజకీయం వేడి పెరిగింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌ ప్రచారంపై దృష్టి పెట్టింది.  అధికార పార్టీ అసంతృప్తి నేతలకు గాలం వేయడంలో కాంగ్రెస్‌ బిజీ బిజీగా మారింది. ఇప్పటికే ఆ పార్టీ నేతలను ఒక్కొక్కరిగా హస్తంలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో  తుమ్మలను కలిసి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి శుక్రవారం బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. 

కాంగ్రెస్ పార్టీలో చేరికల నేపథ్యంలో ఆయన శుక్రవారం రాత్రి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఈమేరకు డీకే శివకుమార్‌ ట్విటర్‌లో వీరిద్దరూ కలిసిన ఫోటోను షేర్‌ చేశారు. ‘టీటీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేడు కుమార్‌ కృపా గెస్ట్‌ హౌజ్‌లో నన్ను కలిశారు. తెలంగాణ రాజకీయ పరిణామాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించాం’ అంటూ పేర్కొన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఇంకా ఏయే అంశాలపై చర్చ జరిగిందనేది ఉత్కంఠగా మారింది. 

తాజాగా డీకే, రేవంత్‌ భేటీపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత నిప్పులు చెరిగారు. రేవంత్‌, డీకే దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం... ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం’ అంటూ ధ్వజమెత్తారు. 
చదవండి: ఖమ్మం రాజకీయాల్లో ఊహించని పరిణామం

కాగా వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్లు కొంతగాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీటికి ఆజ్యం పోసేలా పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గురువారం ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కలిశారు. కాంగ్రెస్‌లో చేరిక, పార్టీ విలీనంపై గతంలో పలు సార్లు డీకే శివకుమార్​తోనూ ఆమె భేటీ అయ్యారు.

వైఎస్​ఆర్​టీపీ పార్టీ విలీనం అంశంలోనూ డీకే శివ కుమార్​ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీకేను కలిసేందుకు రేవంత్​ బెంగళూరుకు వెళ్లినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో వైఎస్​ఆర్టీపీ విలీనంపై చర్చించినట్లు సమాచారం. అంతేగాకుండా.. బీఆర్‌ఎస్‌ తిరుగుబాటు నేత తుమ్మల నాగేశ్వర్‌ రావు చేరికపైనా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌లో తుమ్ముల చేరిక,. షర్మిల పార్టీ విలీనం, వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధివిధానాలపై చర్చించినట్టు సమాచారం.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)