Breaking News

రేవంత్‌.. ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది?: ఎమ్మెల్సీ కవిత

Published on Thu, 06/26/2025 - 10:05

సాక్షి, హైదరాబాద్‌: 18 నెలల కాంగ్రెస్ పాలనలో రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన కానీ.. పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేక పోతున్నారంటూ ఆమె నిలదీశారు.

‘‘అప్పు కావాలని ఆర్‌ఏసీ సంస్థకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నాడు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించాడు. రాష్ట్ర ఆదాయం ఎక్కడకి పోతుందో ప్రజలకు రేవంత్ రెడ్డి  జవాబు చెప్పాలి’’ అంటూ కవిత  డిమాండ్‌ చేశారు.

‘‘అవినీతి చక్రవర్తి బిరుదు రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. వాస్తవాలు లేకుండా నేను ఏది మాట్లాడను. రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు దేనికి ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలి. భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు చీమ కుట్టినట్లు లేదు. ప్రజా భవన్‌లో చంద్రబాబుకు హైదరాబాద్ బిర్యాని తినిపించి బనకచర్ల ప్రాజెక్ట్ కట్టుకోండి అని రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కలలో కూడ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేయరు. రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరు ప్రజా భవన్‌లో కలిసినప్పుడే గోదావరి జలాలను ఏపీకి రేవంత్ రెడ్డి కట్టబెట్టిండు’’ అంటూ కవిత చెప్పుకొచ్చారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు