Breaking News

బొత్స Vs అచ్చెన్న: ‘రైతు భరోసా కేంద్రాలకు తాళం వేయలేదా?’

Published on Wed, 03/05/2025 - 13:43

సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే, చంద్రబాబు రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం లేదని ఘాటు విమర్శలు చేశారు. సభలో ఒకమాట.. బయట ఒకమాట చెబుతున్నారు. రైతులకు మంచి జరగాలన్నదే వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ అని తెలిపారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవపై మండలిలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం, బొత్స మాట్లాడుతూ..‘వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు సరైనవి కాదు. ప్రతీ అంశానికి ఆవు కథ చెప్పడం అలవాటైపోయింది. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇస్తున్నారో చెప్పమని మేం అడిగాం. రైతుల సమస్యలపై చర్చించమని బీఏసీ మీటింగ్‌లో మేం కోరాం. రైతుల పట్ల మాకు అంకితభావం ఉంది.

గత ఐదేళ్లలో రైతులకు మేం చేసిన మేలును నీతి ఆయోగ్ మెచ్చుకుంది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ వ్యవసాయ విధానాలు పాటించాలని సూచించింది. రైతుకు, వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతీ అంశాన్ని రైతు భరోసా కేంద్రంలో మేం అందుబాటులో ఉంచాం. కావాలంటే రికార్డులు చూసుకోండి. రైతుభరోసా కేంద్రాలకు ఈ ప్రభుత్వం తాళాలేసింది. గత ఐదేళ్లలో రైతులకు మేం ఏమీ చేయలేదని రివ్యూ చేసి నిరూపించండి.

మేం మొత్తం 53 లక్షల మందికి రైతుభరోసా అందించాం. అంత మందికీ మీరు ఇస్తామన్నారు.. ఆ మాటకు కట్టుబడి ఉండండి. బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోయినా రైతులకు సాయం చేయండి.. మేం కోరుకునేది కూడా అదే. రైతులకు మంచి జరగాలన్నదే మా డిమాండ్. రైతుకు ఇన్స్యూరెన్స్ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇవ్వండి. 2014-19లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదు?. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం లేదు. సభలో ఒకమాట.. బయట ఒకమాట చెబుతున్నారు. అధికార పార్టీ సభ్యుల వైఖరిని నిరసిస్తూ ఈ ప్రశ్నకు సభనుంచి వాకౌట్ చేస్తున్నాం’ అని అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)