కిషన్‌రెడ్డికి ఆ అవసరమేంటి?.. రాజాసింగ్‌ హాట్‌ కామెంట్స్‌

Published on Wed, 08/27/2025 - 11:54

తెలంగాణ బీజేపీ నేతలపై గోషామహల్‌(హైదరాబాద్‌) ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి హాట్‌ కామెంట్లు చేశారు. తెలంగాణలో బీజేపీకి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పోటీ లేదని.. బీజేపీలో బీజేపీ నేతలతోనే పోటీ నడుస్తోందని, అలాంటి పార్టీని ఇక్కడి నేతలే నట్టేట ముంచుతున్నారని వ్యాఖ్యానించారాయన. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్ బాల్ గిఫ్ట్ ఇవ్వడంపై స్పందిస్తూ రాజాసింగ్‌ ఓ వీడియో వీడియో విడుదల చేశారు. 

ఎంత బాధలో ఉంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకులకు ఫుట్ బాల్ గిఫ్ట్ ఇస్తారు?. ఆయనతోనే కాదు.. గత 11 ఏళ్లుగా నాతో కూడా బీజేపీ నేతలు ఫుట్ బాల్ ఆడుకున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంపీ ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నాయకులు ఇదే మాదిరిగా పార్టీ నేతలకు ఫుట్ బాల్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంచి నాయకుడు. భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పార్లమెంట్లో మీ వ్యక్తులను పెట్టి ఆయన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు?. నా అసెంబ్లీ పరిధిలో కూడా కిషన్ రెడ్డి మనుషులను పెట్టీ నన్ను ఇబ్బంది పెట్టారు. వారికి నా ఏరియాలో పెట్టాల్సినటువంటి అవసరం కిషన్ రెడ్డికి ఏముంది?. తెలంగాణలో ఇక్కడున్న నేతలే బీజేపీని ముంచుతున్నారు. దీనిపై బిజెపి జాతీయ నాయకత్వం ఒక్కసారి రివ్యూ చేయాలి. మాకు బిఆర్ఎస్, కాంగ్రెస్ తో పోటీ కాదు. మా నాయకులతో మేమే కొట్లాడాల్సిన పరిస్థితి తెలంగాణ బీజేపీలో ఉంది. 

.. ఇతర పార్టీల మాజీ ఎంపీ,  ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ మరి బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి?. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం బిజెపికి లేదు. బిజెపిలో ఉన్న కార్యకర్తలకు ఫండ్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించుకుని మంచి నాయకులను తయారు చేస్తే సరిపోతుంది కదా!. బిజెపి కార్యకర్తలు నిరంతరం పార్టీ కోసం కష్టపడి లేబర్ గానే బతకాలా? అని రాజాసింగ్‌ ఆ వీడియోలో చెప్పారు.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్న రీతిలో మంగళవారం నిరసనకు దిగారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆయా జిల్లాల్లోని పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదని కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై చర్చించేందుకు స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావును కలిశారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలవమని కొండాకు రాంచందర్ రావు సూచించారు. ఆయన్ను కలిస్తే రాష్ట్ర ఇన్ చార్జ్ అభయ్ పటేల్​ను కలవాలని సూచించినట్టు తెలిసింది. అభయ్​పటేల్​ను కలిస్తే ఆయన మళ్లీ రాంచందర్ రావు, తివారిని కలవాలని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చి తివారికి ఫుట్ బాల్ ఇచ్చి నిరసన తెలిపారని చర్చ నడిచింది.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)