Breaking News

కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే

Published on Sun, 07/07/2024 - 05:56

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, రంగారెడ్డి జిల్లా/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: గద్వాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చే రారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని  క్యాం పు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెంది న మంత్రి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇలావుండగా సీఎం రేవంత్‌ త్వరలోనే గద్వాలలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రారంభించనున్నారు. ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా అదే రోజు కృష్ణమోహన్‌రెడ్డి అనుచరులు, ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలిసింది. 

జెడ్పీ చైర్మన్‌కు సీఎం సముదాయింపు 
మరోవైపు బండ్ల చేరికను వ్యతిరేకిస్తూ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత వర్గీయులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఆమె సీఎం రేవంత్‌తో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఆమెను ముఖ్యమంత్రి సముదాయించినట్లు తెలిసింది. ఆ తర్వాతే బండ్ల కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. గద్వాల, ఆలంపూర్‌ మినహా మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడంతో జిల్లాలో కాంగ్రెస్‌ బలం 13కు పెరిగింది.

నిధులు కేటాయించండి
శ్రీధర్‌బాబుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వినతి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శనివారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిలు సచివాలయంలో మంత్రిని కలిశారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వారు మంత్రిని కోరారు. అయితే ఆరుగురు ఎమ్మెల్యేలు జిల్లా ఇన్‌చార్జి మంత్రిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Videos

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)