ఎమ్మెల్యే కోటంరెడ్డికి బిగ్‌ షాక్‌!

Published on Mon, 01/27/2025 - 19:04

సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ క్రమంలో వారికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆనం విజయకుమార్‌ రెడ్డి.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. 31వ డివిజన్‌కి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ ఆనం విజయకుమార్ రెడ్డి. ఈ సందర్బంగా విజయకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. అలాగే, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో అధికార పార్టీలకు చెందిన కార్యకర్తలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకపోవడంతో కూటమి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కార్‌పై మండిపడుతున్నారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)