Breaking News

అందుకే సహనం కోల్పోయా.. దానం నాగేందర్‌

Published on Sat, 08/03/2024 - 14:52

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో తాను చేసిన  వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరణ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తనను టార్గెట్‌ చేశారని.. తనను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలిపారు.

శనివారం ఆయన హైదరాబాద్‌ ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారన్నారు. అసభ్యకర పదాలతో దూషించారని పేర్కొన్నారు.

కాగా, శాసనసభలో శుక్రవారం.. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంయమనం కోల్పోయారు. బీఆర్‌ఎస్‌ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మైక్‌ ఆన్‌లో ఉండడంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలో వెళ్లడం, సభలో వినిపించడంతో గందరగోళానికి దారితీసింది. 

హైదరాబాద్‌లో సుస్థిర అభివృద్ధి అంశంపై స్పీకర్‌ లఘు చర్చను ప్రారంభించి దానం నాగేందర్‌కు మైక్‌ ఇచ్చారు. నాగేందర్‌ మాట్లాడటం ప్రారంభించగానే.. ఆయన వైపు తిరిగి ‘నువ్వు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు’అంటూ బీఆర్‌ఎస్‌ సభ్యులు గట్టిగా నిలదీశారు. నాగేందర్‌ ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా, వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పదేపదే ప్రశ్నించటంతో నాగేందర్‌ తీవ్ర అసహనానికి గురయ్యారు.

ఆ క్రమంలోనే సహనం కోల్పోయి.. ‘నన్ను ఏయ్‌ అంటారా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మళ్లీ నాగేందర్‌ను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావంటూ నిలదీయటంతో.‘ఏయ్‌ మూసుకో రా..నీయమ్మ.. తోలు తీస్తా కొడుకా ఒక్కొక్కరిది.. నీ యమ్మ బయట కూడా తిరగనీయరా. ఏం అనుకుంటున్నార్రా మీరు...తోలు తీస్తా...బయట కూడా తిరగనియ్య.. రారా.’అంటూ మాట్లాడటంతో సభ్యులంతా విస్తుపోయారు.
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)