Breaking News

‘పవన్‌.. చిరంజీవి కష్టపడి సంపాదించిన ఇమేజ్‌ నీకు లభించింది’

Published on Sat, 06/17/2023 - 15:13

సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్‌ కల్యాణ్‌పై మంత్రి వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ పూటకో వేషం వేస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. చంద్రబాబు వల్ల పుష్కరాల్లో 29 మంది చనిపోతే పవన్‌ ఒక్కసారైనా దాని గురించి మాట్లాడావా? అని ప్రశ్నించారు. పవన్‌ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 

కాగా, మంత్రి వేణుగోపాల్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ స్థిరత్వం లేని వ్యక్తి. ముఖ్యమంత్రి పదవిని ఆశించలేదంటాడు.. ఇస్తే తీసుకుంటానంటాడు. నువ్వు చేసిన తప్పదాల గురించి నీ మనస్సాక్షిని అడుగు. తప్పులు ఉంటే చెప్పాలి కానీ చెప్పులు చూపిండం కాదు. నీ కార్యకర్తల మనోభావాలపై బండరాయి వేస్తున్నావు. కుల ప్రస్తావన లేకుండా ఏ సభలోనూ మాట్లాడలేని వ్యక్తి పవన్‌. చిరంజీవి కష్టపడి సంపాదించిన ఇమేజ్‌ నీకు లభించింది. 

పవన్‌.. పిఠాపురంలో నీవు మాట్లాడిన ధర్మ పరిరక్షణ వల్లించిన సూక్తులు ఏనాడైనా పాటించావా?. పవన్‌.. ధర్మభక్షణ చేసే వ్యక్తి పక్కన నువ్వున్నావ్‌. పవన్‌.. నువ్వు సినిమాల్లో హీరో కావచ్చు. రాజకీయాల్లో జీరో అని ప్రజలకు అర్థమైంది. గోదావరి జిల్లాలో నీ సామాజిక వర్గానికి సమస్య వచ్చినప్పుడు నువ్వెక్కడున్నావ్‌. రైతులకు, మహిళలకు, చిన్నారులకు, విద్యార్థులకు, అనేక పథకాలు ప్రభుత్వం అందిస్తోంది. ఇవేవీ నీకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నారాహి యాత్రను ప్రజలు పట్టించుకోరు అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: ‘పవన్‌కు కావాల్సింది చంద్రబాబే.. జనసేన కార్యకర్తలు కాదు’

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)