Breaking News

అహంకారంతో ఇష్టానుసారం వ్యాఖ్యలు

Published on Fri, 01/26/2024 - 05:51

వేములవాడ: అధికారం కోల్పోయి కూడా కేటీఆర్‌ అహంకారంతో బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారని, తమ ప్రభుత్వంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని పంచాయతీరాజ్, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను గురువారం దర్శించుకున్న అనంతరం మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడారు. తొమ్మిదేళ్ల గడీల పాలన నుంచి విముక్తి పొందేందుకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇంకా ప్రమాణస్వీకారం చేయడం లేదని, అధికారం ఉంటేనే ప్రజల్లోకి వచ్చే ఆలోచనలో తండ్రీకొడుకులు ఉన్నారని ఎద్దేవా చేశారు.

ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటిస్తే.. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్‌లకు పెండింగ్‌ బిల్లులు పెట్టింది గత ప్రభుత్వం కాదా?.. అని సీతక్క ప్రశ్నించారు. ప్రజాసంక్షేమాన్ని గాలి కొదిలేసి తమకిష్టమైన పనులు చేసుకుంటూ రాష్ట్రా న్ని దివాళా తీయించారని మండిపడ్డారు. వేముల వాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.  ప్రతి నెల 5వ తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు అందేలా చూస్తున్నట్లు తెలిపారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)