Breaking News

బడ్జెట్‌పై కేసీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్‌

Published on Thu, 07/25/2024 - 15:11

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్‌ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్‌పై స్పందించని కేసీఆర్‌, రాష్ట్ర బడ్జెట్‌ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈమేరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే కేసీఆర్‌ ఎందుకు రాలేదని ప్రశ్నించారుజ కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్‌... రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు.

బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీ కి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్‌  టార్గెట్ చేస్తున్నాడని సీతక్క విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ మెప్పుకోసమే ఆయన రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ రావడమే అందుకు నిదర్శనమని అన్నారు.

కాగా తెలంగాణ బడ్జెట్‌.. రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు జల్లేలా ఉందని కేసీఆర్‌ మండిపడ్డారు. తమ పాలనలో ఎన్నో పథకాలు పెడితే.. వాటన్నింటిని కాంగ్రెస్‌ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. రైతులకు, మత్య్సకారులకు.. ఇలా వర్గానికి మేలు చేసేలా లేదు. ఐటీ, పారిశ్రామిక విధానాలు లేవు. తెలంగాణ బడ్జెట్‌ ఒట్టి గ్యాస్‌.. ట్రాష్‌. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఒత్తి ఒత్తి ఆర్థిక మంత్రి మాట్లాడారే తప్ప.. కొత్తగా ఏమీ చెప్పలేదు. ఏదో కథ చెప్పినట్లు.. రాజకీయ ప్రసంగంలా ఉందే తప్పా.. ఏ ఒక్క వర్గానికి మేలు చేసేలా లేదన్నారు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)