Breaking News

షర్మిలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్

Published on Fri, 01/26/2024 - 20:53

సాక్షి, విజయవాడ: ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి జనం పిచ్చోళ్లు కాదన్నారు మంత్రి ఆర్కే రోజా. తమతో ఉంటున్నదెవరో.. తమ సమస్యల కోసం పోరాడిందెవరు.. అధికారంలోకి వచ్చాక పరిష్కరించిందెవరో ప్రజలకు తెలుసు. ఇచ్చిన హమీలు నెరవేర్చిన నేతలు వైఎస్సార్, వైఎస్ జగన్ అని రోజా పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. ఇక్కడే ఓటు.. ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్య ఉంటున్న ప్రజా నాయకుడు జగనన్న’’ అని ఆమె కొనియాడారు.

‘‘రాజన్న రాజ్యం తెస్తానని పావురాల గుట్టలో జగనన్న తన తండ్రికి ప్రామిస్ చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. కేసులు పెట్టి జైల్లో పెట్టినా.. ఏరోజు తలొగ్గలేదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఏ పార్టీలో విలీనం చేయలేదు. అదీ నాయకుడి లక్షణం. పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి.. ప్రజలు ఛీ కొడితే.. ఇక్కడకొచ్చి కాంగ్రెస్‌లో చేరి మాట్లాడితే ప్రజలు నమ్మరు’’ అంటూ రోజా దుయ్యబట్టారు.

‘‘కాంగ్రెస్‌కు ఏపీలో ఓటు అడిగే అర్హత లేదు. బాగున్న రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్. రెండు సార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్ పేరును ఆయన చనిపోయాక ఎఫ్ఆఐర్‌లో పెట్టి అవమానించిన పార్టీ కాంగ్రెస్‌. వైఎస్సార్ లేని సమయం చూసి ఆయన కుటుంబాన్ని రోడ్డుకీడ్చింది కాంగ్రెస్. ఆ పార్టీలోకి వచ్చి ఎవరు విమర్శలు చేసినా జీరోలే అవుతారు. సామాన్య కార్యకర్తను కూడా తన కుటుంబ సభ్యుడిగా చూసే వ్యక్తి సీఎం జగన్‌. ఇష్టానుసారంగా మాట్లాడే నోర్లకు 2024 సమాధానం చెబుతుంది’’ అని  మంత్రి రోజా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: షర్మిల అబద్ధాలు.. ఇవీ అసలు నిజాలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)