Breaking News

పవన్‌ వ్యాఖ్యలు.. చంద్రబాబు స్పందించాలి: పొన్నం

Published on Tue, 12/02/2025 - 13:55

సాక్షి, సిద్ధిపేట: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని.. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్‌ చేసిన కామెంట్లపై తెలంగాణ  నాయకులు భగ్గుమంటున్నారు. పవన్‌ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు.

మంత్రి పొన్నం​ ప్రభాకర్‌ సిద్దిపేటలోని హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలు. తెలంగాణ తుపానులో మునుగుతుంటే మేము ప్రకృతి అనుకున్నాం తప్ప ఏపీని తప్పుపట్టడం లేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్‌.. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే ఆయన వివేకవంతుడా? లేక అవివేకా? అని ప్రశ్నించారు. 

..మిత్రపక్షానికి బాధ్యత వహిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆయన వ్యాఖ్యలపై స్పందించాలని కోరుతున్నాను. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలి. స్వయంగా బీజేపీ పొత్తు ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు కలిగేలా మాటలు మాట్లాడటం దురదృష్టకరం. ఏపీలో తుఫాను వస్తే మా హుస్నాబాద్ మునిగింది.. మేము ఏపీ ప్రజలను తప్పు పట్టడం లేదు. అది ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తున్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మా దిష్టి తగిలిందని నిందిస్తే ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం. వెంటనే పవన్ తన మాటలు ఉప సంహరించుకోవాలి.. క్షమాపణలు కోరాలి. భవిష్యత్తులో ఇలాంటి వివక్ష పూరిత మాటలు మాట్లాడవద్దు.. విజ్ఞతగా వ్యవహరించాలి. ఉప ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడాలి. ఏపీ, తెలంగాణ కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగాలి.. ఇలాంటి వ్యాఖ్యలు మాకు రావు.. మీరు మాట్లాడకూడదు అని హితవు పలికారు. 

నీకు సిగ్గుంటే తెలంగాణ వదిలి వెళ్ళిపో పవన్ పై కాంగ్రెస్ నేతలు సీరియస్

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)