Breaking News

ఎలా ఇవ్వరో మేమూ చూస్తాం: మంత్రి పొన్నం

Published on Sun, 01/26/2025 - 15:28

సాక్షి, హైదరాబాద్‌: బండి సంజయ్(Bandi Sanjay) ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని.. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా?.. ఎలా ఇవ్వరో తామూ చూస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar) మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

10 నెలల కాలంలో జీఎస్టీ రూపంలో రూ.37 వేల కోట్ల రూపాయలు కేంద్రం వసూలు చేసింది. మరి కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఎంత? అంటూ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహ జ్యోతి లాంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారు?. వీల్లేమైనా దేశం కోసం ప్రాణ త్యాగం చేశారా?. తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క రూపాయన్న కేంద్రం నుంచి అదనంగా తెచ్చారా?’’ అంటూ పోన్నం ప్రభాకర్‌ ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: ప్రధాని ఫొటో పెడితేనే నిధులు..

కాగా, కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే పథకాలకు ప్రధాని ఫొటోను వాడకుంటే తామే లబ్దిదారులకు నేరుగా నిధులు ఇచ్చేలా ఆలోచన చేస్తా­మంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాలకు మళ్లిస్తున్నాయి. గతంలో నేను నిలదీయడం వల్ల వరంగల్, కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ నిధులను గత ప్రభుత్వం విడుదల చేసింది. ఇకపై కేంద్ర నిధులతో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రేషన్‌కార్డులపై సీఎంతోపాటు ప్రధాని ఫొటో తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆయా పథకాలకు నిధులు నిలిపివేస్తాం’ అంటూ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.

 

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)