Breaking News

రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా? 

Published on Thu, 11/02/2023 - 04:07

సాక్షి, హైదరాబాద్‌:  రైతుబంధు, రైతుబీమా ప్రపంచంలోనే అత్యుత్తమ పథకాలుగా అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తుండగా, కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఈ పథకాలను దుబారా అంటూ వ్యాఖ్యలు చేస్తు న్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు భిక్ష అంటున్న కాంగ్రెస్‌ పార్టీకి, రైతులు భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పాలనలో బ్యాంకు అప్పుల వసూలుకు రైతుల ఇంటి తలుపులు తీసుకెళ్లిన ఘటనలు ఉండేవని, కానీ కేసీఆర్‌ ప్రభుత్వం మాత్రం రైతుబంధు ద్వారా 11 విడతల్లో రూ.72,815 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిందని వెల్లడించారు.

కొల్లాపూర్‌ సభలో కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పాలమూరు ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోసి రైతుల పొలాలకు అందిస్తున్న ఘనత బీఆర్‌ఎస్‌ సర్కారుకే దక్కుతుందన్నారు. ధాన్యం కొనుగోలు, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, సాగునీటి శిస్తురద్దు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రుణమాఫీ ద్వారా రైతులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

నకిలీ విత్తనాలను అరికట్టడం ద్వారా విత్తన రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉందన్నారు. నిందలు, వ్యక్తిగత విమర్శలతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాదన్నారు. రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలను పట్టించుకోరన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి, సాట్స్‌ మాజీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు