Breaking News

‘గుడ్లవల్లేరు’లో ఏం జరగలేదట!.. మీడియాపై లోకేష్‌ చిందులు

Published on Sun, 09/01/2024 - 13:23

సాక్షి, కృష్ణా జిల్లా: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏం జరగలేదంటూ మీడియాపై మంత్రి నారా లోకేష్‌ చిందులు తొక్కారు. విచారణ జరగక ముందే ఆ కాలేజీ ఏం జరగలేదని ఆయన తేల్చేశారు. ఈ విషయాన్ని సెన్సేషన్‌ చేయొద్దని మీడియాకు వార్నింగ్‌ కూడా ఇచ్చేశారు. ‘‘గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్‌  కెమెరాలు లేవు. ఎక్కడ ఒక  వీడియో బయటికి రాలేదు. విద్యాశాఖ మంత్రిని కాబట్టే నా మీద ఫోకస్‌ పెట్టారు. కావాలని రచ్చ చేస్తున్నారు’’ అని మీడియా ప్రతినిధులపై లోకేష్‌ ఆగ్రహం వెళ్లగక్కారు.

మరోవైపు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల బాలికల వాష్‌ రూమ్‌ల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో యాజమాన్యం, చంద్రబాబు ప్రభు­త్వం దొంగాటపై ప్రజలు, మేధావులు మండిపడు­తున్నారు. విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుని, మనోధైర్యం నింపాల్సిన యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు నిర్బంధంగా వ్యవహరిస్తున్నాయి? అనే దానిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

కాగా, ప్రతిపక్ష నేతను పట్టుకుని వాడు, వీడు అంటూ వెకిలిగా మాట్లాడే హోంమంత్రి అనిత గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లలేకపోయారు?. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలో నడిచే ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు ఈ వ్యవహారాన్ని వైఎస్సార్‌సీపీ మీదకు నెట్టేయడానికి ఎందుకు ప్రయత్నించాయి? ఇది ఎవరి ప్రయోజనం కోసం? అని ప్రశ్నిస్తున్నారు.

కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారనే ఇంగితం కూడా ఎల్లో బ్యాచ్‌కు లేకపోవడం శోచనీయం కాదా? రాష్ట్రంలో ఐపీఎస్‌లపై కక్షసాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందనేది వాస్తవం కాదా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)