బీఆర్ఎస్ బరాబర్ వారసత్వ పార్టీనే: కేటీఆర్‌

Published on Mon, 10/02/2023 - 16:18

సాక్షి, సూర్యాపేట జిల్లా : బీఆర్‌ఎస్‌ పార్టీ బరాబర్‌ వారసత్వ పార్టీనే అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌. తమది వారసత్వ పార్టీ అని, కుటుంబ పాలన అని విమర్శిస్తున్న వాళ్లకి తనదైన శైలిలో బదులిచ్చారు కేటీఆర్‌. సూర్యాపేట సభలో ప్రసంగించిన కేటీఆర్‌. ‘ బరాబర్‌ మాది కుటుంబ పాలనే. ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న కేసీఆర్‌ తప్పకుండా తెలంగాణ కుటుంబ సభ్యుడే. ఎందరో నాయకుల త్యాగఫలమే వారసత్వ పార్టీ. మోదీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. సూర్యాపేటలో జగదీష్‌రెడ్డిని 50వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. 

రాష్ట్రమంతా విద్యుత్ వెలుగు విరజిమ్ముతున్నాయంటే మంత్రి జగదీష్‌రెడ్డి ఆలోచన విధానానికి నిదర్శనం. అవతలి వారు ఎన్ని ఎత్తులు వేసిన జగదీష్‌రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరు. కంటి ముందు సంక్షేమం ఇంటి ముందు అభివృద్ధి కనబడుతుంది.  శిఖండి రాజకీయాలు తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదు. జగదీష్ రెడ్డి ఓడిపోతాడాని కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నాడు. ప్రజల్లో తేల్చుకుందాం రా.  కాంగ్రెస్ పార్టీ  వారంటీ లేని  సచ్చిన పీనుగ లాంటి  పార్టీ.  కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చారు మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు.ఓటుకు నోటుకు దొరికిన దొంగ, రేవంత్ సీట్లు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేద్దామా.?, కేసీఆర్ అభివృద్ధి అంటే  ఏంటో చూపిస్తున్నాడు.మోదీ వచ్చి కుటుంబ పాలన అంటున్నాడు’ అని కేటీఆర్‌విమర్శించారు.

చదవండి: ‘రేపు ప్రధాని మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు’

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)