Breaking News

పొన్నాలతో కేటీఆర్‌ భేటీ.. బీఆర్‌ఎస్‌లో చేరిక ఎప్పుడంటే..

Published on Sat, 10/14/2023 - 14:27

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని పొన్నాల లక్ష్మయ్య నివాసానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. ఈ సందర్బంగా వీరిద్దరూ భేటీ అయ్యారు. ఇక, కేటీఆర్‌తో పాటుగా మరికొందరు బీఆర్‌ఎస్‌ నేతలు కూడా పొన్నాల ఇంటికి 

ఇక, భేటీ అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేందుకు పొన్నాల ఇంటికి వచ్చాం. ఆయనను బీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానించాం. ఈనెల 16వ తేదీన కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో పొన్నాల చేరుతారు. పొన్నాలకు బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం కల్పిస్తాం. ఆయనకు గౌరవం, ప్రాధాన్యత ఇస్తాం. రేపు సీఎం కేసీఆర్‌ను కలవాలని పొన్నాలను కోరాం. కేసీఆర్‌తో భేటీ తర్వాత మిగిలిన విషయాలు పొన్నాల చెతుతారు. కేకే, డీఎస్‌ వంటి వాళ్లను పార్టీలో పదవులు ఇచ్చి గౌరవించాం.

పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు అని చూడకుండా కాంగ్రెస్ పార్టీ అవమానంగా మాట్లాడారు. 45 ఏళ్లు పనిచేసినా కాంగ్రెస్‌ అవమానాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారలేదు. ఆయన పార్టీలు మారొచ్చు కానీ ఇతరులు గౌరవం లేకపోతే మారొద్దా?. దిగజారుడు సంస్కృతి మంచిది కాదు. చనిపోయే ముందు పార్టీ మారటం ఏంటని మాట్లాడుతున్న నేతలు చిల్లరగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓటుకు నోటుకు దొంగను పీసీసీ కుర్చీలో కూర్చోబెట్టారు. పొన్నాలకు మార్టీ న్యాయం చేస్తుంది’ అని కామెంట్స్‌ చేశారు. 

అనంతరం.. పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. ‘కేటీఆర్‌ నన్ను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. రేపు సీఎం కేసీఆర్‌ను కలుస్తాను. సీనియర్‌ నాయకుడిపై మాట్లాడేందుకు రేవంత్‌కు ఎంత ధైర్యం. కాంగ్రెస్‌లో రేవంత్‌ అసెంబ్లీ సీటు గెలిచారా?. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వచ్చాయి?. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు పోయాయి. కాంగ్రెస్‌లోకి ఇలాంటి వాళ్లు వచ్చి భ్రష్టుపట్టిస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: ‘ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య’

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు