Breaking News

‘కేంద్రంలో సంకీర్ణమే.. బీఆర్‌ఎస్‌ లేకుండా ఎవరూ ప్రధాని కాలేరు’

Published on Sat, 08/12/2023 - 16:08

సాక్షి, యాదాద్రి భువ‌న‌గిరి: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వచ్చే ఎన్నికలపై సంచలన కామెంట్స​ చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ మద్దతు లేకుండా ఎవరూ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

కాగా, మంత్రి కేటీఆర్‌ శనివారం యాదాద్రి భువనగిరి పర్యటనలో ఉన్నారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వ‌హించిన‌ చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నేత‌న్న‌కు ప్ర‌తీక మ‌గ్గం. సీఎం కేసీఆర్‌కు నేత‌న్న‌ల క‌ష్టాలు తెలుసు. నేత‌న్న‌ల సంక్షేమం కోసం భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు. చేనేత మిత్ర పేరుతో నూలు, ర‌సాయ‌నాల మీద 50 శాతం స‌బ్సిడీ ఇస్తున్నాం. నేత‌న్న‌కు చేయూత పేరిట పొదుపు ప‌థ‌కం తీసుకొచ్చాం. రైతుబీమా త‌ర‌హాలో నేత‌న్న‌కు బీమా తెచ్చాం. ఇవ‌న్నీ కేసీఆర్ సీఎం కావ‌డం వ‌ల్లే సాధ్య‌మైంద‌న్నారు. 

చేనేత ఉత్ప‌త్తుల‌ను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లే బాధ్య‌త ఉంది. అగ్గిపెట్టెలో ప‌ట్టే చీర‌ను నేసిన నైపుణ్యం ఉన్న నేత‌న్న‌లు మ‌న తెలంగాణ నేత‌న్న‌లు. ఉప్ప‌ల్‌లో హ్యాండ్లూమ్ మ్యూజియంను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పోచంప‌ల్లి చేనేత కళాకారులు భాగ‌స్వాములై వినియోగించుకోవాలి. నేత కార్మికుల‌ను సంఘ‌టితం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది. మాది కోత‌ల ప్ర‌భుత్వం కాదు.. మాది చేత‌ల ప్ర‌భుత్వం.. చేనేత‌ల ప్ర‌భుత్వం. 2001లో భూదాన్ పోచంప‌ల్లిలో నేత‌న్న‌ల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశామ‌ని కేటీఆర్ వివ‌రించారు.

ఇది కూడా చదవండి: నోటిఫికేషన్‌ ఇస్తే కోర్టుకు.. వైన్స్‌ టెండర్లు మాత్రం క్లియర్‌.. కేసీఆర్‌ సర్కార్‌ బీజేపీ ఫైర్‌

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)