Breaking News

సొంత పార్టీ నేతలకు కొండా సురేఖ భర్త మాస్‌ వార్నింగ్‌

Published on Thu, 06/19/2025 - 16:26

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ కాంగ్రెస్‌లో వార్‌ ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. కనుబొమ్మలు లేని నాయకుడు నాడు టీడీపీని భ్రష్టు పట్టించాడు. మొన్న కేటీఆర్‌ను వెన్నుపోటు పొడిచిండు. ఎన్‌కౌంటర్ల స్పెషలిస్ట్.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాడు. మీకు ఇజ్జత్ ఉంటే బయటి పార్టీ నుంచి వచ్చిన నాయకులు మీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి’’ అంటూ కొండా మురళి వ్యాఖ్యానించారు.

వరంగల్ పోలీస్ కమిషనర్‌కు చెపుతున్నా.. మీ డిపార్ట్‌మెంట్‌లో కోవర్డులు ఉన్నారు. నాకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై చర్యలు కాదు.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కోవర్డులపై చర్యలు తీసుకోండి. కొండా మురళి ఉన్నంత వరకు వరంగల్ తూర్పులో రెండో నాయకుడు ఎవరూ ఉండరు. పరకాలలో 75 ఏళ్ల వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నాడు’’ అంటూ కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘పరకాల నియోజకవర్గంలో నా కూతురు కొండా సుస్మిత పటేల్ రంగప్రవేశం చేయనుంది. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆమె మంత్రి పదవి ఎక్కడికి పోదు’’ అని కొండా మురళి పేర్కొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)