Breaking News

బీఆర్‌ఎస్‌కు కోమటిరెడ్డి సవాల్‌.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?

Published on Tue, 10/01/2024 - 14:59

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రతిపక్షాలకు మానవత్వం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీ నది విషయంలో ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు. తెలంగాణను పది సంవత్సరాలు పాలించి బీఆర్‌ఎస్‌ నేతలు దోచుకున్నారని ఘాగు విమర్శలు చేశారు.

మంత్రి కోమటిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మూసీలో పారేది విషపు నీరు. తెలంగాణ వచ్చాక మూసీ స్థితి మారుతుందని అనుకున్నాం. మూసీ కోసం కేటీఆర్‌ వెయ్యి కోట్లు అప్పు తెచ్చారు. మూసీ డెవలప్మెంట్ బోర్డు అన్నావ్ కదా ఏమైంది?. గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాళ్లు మూసీ పక్కన ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. లక్షల కోట్లు సంపాదించుకున్నావు కాదా.. పేదలపై కొంచెం కూడా జాలి లేదా?. మూసీ ప్రక్షాళన చేస్తే కమీషన్ రాదని మొదలు పెట్టలేదా?. మూసీని ప్యూరిఫైర్ రివర్‌గా మార్చాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది.

ప్రతిపక్షాలకు కనీసం మానవత్వం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ వచ్చి మూసీ ప్రక్షాళనపై మాట్లాడాలి. కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకులు కాదు. కాళేశ్వరం ఒక తుగ్లక్ పని. మల్లన్న సాగర్ నిర్వాసితులను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చూశాం. మూసీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆర్ దగ్గర ఓఎస్‌డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్‌ను అడగండి. మల్లన్న సాగర్ నిర్వాసితులను పోలీసులతో ఎందుకు కొట్టించారు?.

నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువ. మూసీ ప్రక్షాళనలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. నేను నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నాను. మమ్మల్ని చావామంటారా?. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వాళ్లు గోదావరి జలాలతో సంతోషంగా ఉండాలి. మేము మాత్రం నల్గొండ మూసీ మురికితో చావాలా?. మూసీ నీళ్లను అమెరికా తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. నల్గొండ వచ్చినా, వయా నల్గొండ వెళ్ళినా అక్కడి ప్రజలు ప్రతిపక్ష నేతలకు బుద్ధి చెప్తారు. జిల్లా పరిషత్ బడుల్లో చదివిన మాకే ఇంత తెలివి ఉంది. అమెరికాలో చదువుకున్న అని చెప్పుకుంటున్న నీకు తెలివి ఏమైంది?. నల్గొండలో మీ బంధువులు లేరా?. నల్గొండపై ఎందుకు కక్ష కట్టారు?.

బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ చేస్తున్నా.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?. బస్సు పెడతాను, నేను మీతో పాటే వస్తాను. ప్రజలు ఏం చేస్తారో మీరే చూడండి. నేను 25ఏళ్ల కింద మూసీ నది కోసం దీక్ష చేశాను. జయశంకర్‌ అప్పుడు నాకు మద్దతు తెలిపారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు రెచ్చగొడుతున్నారు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: బుల్డోజర్‌ను బొం‍ద పెట్టండి: మూసీ నిర్వాసితులతో కేటీఆర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)