Breaking News

Adani Row: ‘అమెరికా మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు’

Published on Wed, 11/27/2024 - 17:04

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, అదానీ అంశంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీని నేడు తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారు. అనంతరం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర నేతలతో ప్రధాని మోదీ చర్చించారు. తెలంగాణలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అభివృద్ది విషయంలో సానుకూల ధోరణితో పని చేయాలన్నారని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలో ఏం చేశారో రేవంత్ రెడ్డి  చెప్పాలి. వంద రోజులలో ఆరు గ్యారెంటీల అమలులో విఫలమయ్యారు. నాది బీజేపీ డీఎన్ఏ.. మీలాగా పది పార్టీలు మారిన డీఎన్ఏ కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 1 నుంచి 5 వరకు ప్రచారం చేస్తాం. ఇప్పటికైనా సీఎం రేవంత్, విపక్షాలను తిట్టే బదులు పాలనపై దృష్టి పెట్టాలి.

విషాహారం తిని విద్యార్థులు చనిపోవడానికి గల కారణాలపై దృష్టి సారించాలి. ఎమ్మెల్యేల ఫిరాయింపులను నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొందూ దొందే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇదే సమయంలో అదానీ అంశంపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. అదానీ అంశంలో అమెరికా మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అక్కడ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అదానీపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ఈ ఆరోపణలు చేస్తున్నాయి. మా దేశంపై ఎలా ఆరోపణలు చేస్తారు. పార్లమెంటు సమావేశాలకు ముందుగానే ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)