Breaking News

‘ఈనాడు తప్పుడు రాతలు.. కళ్లు పెద్దవి చేసుకుని చూడు రామోజీ’

Published on Sun, 08/27/2023 - 20:03

సాక్షి, తాడేపల్లి: ధాన్యం కొనుగోళ్లపై రామోజీవి తప్పుడు రాతలు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై రామోజీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రైతులకు కనీసం ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని, సీఎం జగన్‌ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని మంత్రి అన్నారు.

‘‘రాష్ట్రంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నారు. రామోజీ కళ్లు పెద్దవి చేసుకుని చూస్తే నాడు-నేడు ఏం జరిగిందో అర్థమవుతోంది. సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం పచ్చగడ్డిలా మేసేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం 2 కోట్ల 65 లక్షల మెట్రిక్ టన్నులు  మాత్రమే. ఈ ప్రభుత్వం 32 లక్షల మంది రైతుల నుంచి 3 కోట్ల 10 లక్షల 65 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించింది. 58 వేల కోట్లు చెల్లించాం’’ అని మంత్రి పేర్కొన్నారు.

‘‘చంద్రబాబు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇచ్చాం. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం. రామోజీ.. ఈనాడు పత్రికను మరింతగా దిగజారుస్తున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా చేసిన మా పై నిందలా.. తప్పుడు రాతలు రాయడానికి రామోజీకి సిగ్గులేదా?. వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశాం. టీడీపీ హయాంలో దళారీ వ్యవస్థతో రైతులను దోచుకుతిన్నారు. రాష్ట్రంలో రైతులకు మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు. నిజాలు తెలుసుకుని వార్తలు రాయడం నేర్చుకో రామోజీ’’ అంటూ మంత్రి  కారుమూరి దుయ్యబట్టారు.
చదవండి: సినిమా రేంజ్‌లో సీన్లు పండించిన పవన్‌.. ప్లాన్‌ బెడిసికొట్టింది!

‘‘దొంగ ఓట్లు చేర్చడంలో చంద్రబాబు దిట్ట. ఈ రోజు నిజం బయటపడటంతో చంద్రబాబు భయపడుతున్నాడు. చంద్రబాబు మాకొద్దు బాబోయ్ అంటున్నారు ప్రజలు. 600 హామీలిచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది ఎవరు?. డ్వాక్రా మహిళలను మోసం చేసింది ఎవరు? చంద్రబాబు, లోకేష్, పవన్ రోడ్లపై తిరగడం వల్ల వర్షాలు కూడా పడటం లేదు’’ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)