Breaking News

రైతుబంధు నిలిపివేతపై మంత్రి హరీశ్‌ కామెంట్స్‌..

Published on Mon, 11/27/2023 - 11:53

సాక్షి, జహీరాబాద్‌: ఎన్నికల వేళ ఎలక్షన్‌ కమిషన్‌ రైతుబంధు నిలిపివేయడంపై మంత్రి హరీశ్‌ రావు స్పందించారు. రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తామని స్పష్టం చేశారు. 

కాగా, మంత్రి హరీశ్‌ రావు జహీరాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైతులతో పేగుబంధం మాది. కాంగ్రెస్‌ పార్టీ రైతుల నోటికాడ బుక్కను లాక్కుంది. రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. నేను మీటింగ్‌లో న్యాయం గెలిచిందని.. రైతుబంధుకు ఈసీ క్లియరెన్స్‌ ఇచ్చిందని అన్నాను. రైతుబంధును ఆపిన కాంగ్రెస్‌కు ఓటుతోనే పోటు పొడవాలి. రైతుబంధు రావాలంటే కాంగ్రెస్‌ ఖతమ్‌ కావాలి. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తాం. ఎకరాకు రైతుబంధు కాదు.. ఒక్కో రైతుకు 15వేలు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. ఓట్ల కోసం రైతుబంధు తీసుకురాలేదు. 

కేసీఆర్‌ వస్తే పెన్షన్‌ రూ.5వేలు ఇస్తాం. సౌభాగ్యలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తాం. పేదలకు రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. రేషన్‌కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తాం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఝురాసంఘంలో ఆరువేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇస్తాం’ అని తెలిపారు. 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)