Breaking News

‘కాంగ్రెస్‌ ప్రభుత్వం.. నామినేట్ పోస్టుల్లో అర్బన్ నక్సలైట్లు’

Published on Wed, 11/19/2025 - 13:20

సాక్షి, కరీంనగర్: తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం అయ్యారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో నామినేట్ పోస్టుల్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు అంటూ విమర్శలు గుప్పించారు. మావోయిస్టులను అంతం చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అధికారంలో ఉన్నా, లేకున్నా నక్సలైట్ల అణచివేతే మా లక్ష్యం. తుపాకీ గొట్టంతో సాధించేది ఏమీలేదు. పౌరహక్కుల నాయకులే నక్సలిజం అంతరించి పోయిందని ఒప్పుకున్నారు. ఇన్ని రోజులు అమాయక పిల్లలు, యువకులను రెచ్చగొట్టింది అర్బన్ నక్సలైట్లే. వారికి ప్రజల బాధలు తెలియవు. వారిపైన కూడా చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తే నేను భయపడను. తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం అయ్యారు.

జంగల్‌లో ఉన్న నక్సలైట్లు పని పిల్లలకు తుపాకులు ఇస్తున్నారు. మావోయిస్టులను అంతం చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం. జంగల్ వదిలి, తుపాకులు విడిచిపెట్టి బయటకి రండి. తెలంగాణలోని కాంగ్రెస్ పాలనలో నామినేట్ పోస్టుల్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు. నక్సలిజన్ని ఎవరు ప్రోత్సహించినా వారు నేరస్తులే అవుతారు. మావోయిస్టులకు మద్దతు ఇచ్చే వారిపై కూడా చర్యలు ఉంటాయి అని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)