Breaking News

‘కాంగ్రెస్‌ వినాశకర పాలన.. ఏడాది మొత్తం దారుణాలే’

Published on Wed, 01/08/2025 - 11:43

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌(bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ(AICC) ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దోపిడీ దారులు, విధ్వంసకారులు, అబద్ధాల పార్టీగా మారిందని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్(Congress Party) వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్‌ ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా సంజయ్‌ ట్విట్టర్‌లో..‘ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదు. మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు. అంతేకాకుండా ఇళ్లను పడగొట్టడం, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం గర్భిణీలను వీధుల్లోకి నెట్టారు. ఇది పాలన కాదు. ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం.

తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది వినాశకరమైన పాలనలో అత్యాచార కేసులు 28.94%, మహిళల హత్యలు 13%పెరిగాయి. కిడ్నాప్‌లు, అపహరణలు 26% పెరిగాయి. కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది?. మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురవుతోంది. కాంగ్రెస్ హయాంలో 10,000 మంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యారు. కాంగ్రెస్ దోపిడి దారుల, విధ్వంసకారుల, అబద్ధాల పార్టీగా మారింది అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)