Breaking News

కేటీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌.. హరీష్‌, కవిత విచారణకు రావాలంటూ..

Published on Sat, 08/09/2025 - 12:43

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను మాజీ మంత్రి కేటీఆర్‌.. ట్యాపింగ్‌ చేయించారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై ప్రమాణానికి సిద్ధమని.. ఏ గుడికి రమ్మంటారో కేటీఆర్‌ టైమ్‌, డేట్‌ చెప్పాలని బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు.

కేంద్రమంత్రి బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష అని స్నేహంలో ఉన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను బీఆర్‌ఎస్‌ ప్రశ్నించడం లేదు. కేటీఆర్‌ సోదరి కవితనే.. తన ఫోన్‌ ట్యాపింగ్‌ అయ్యిందని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై నేను ప్రమాణానికి సిద్ధం. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయలేదని కేటీఆర్‌ ప్రమాణం చేస్తాడా?. నా సవాల్‌కు కేటీఆర్‌ సిద్దమా?. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బీఆర్‌ఎస్‌ను వదిలేసి బయటికి రావాలి. కాళేశ్వరం రిపోర్ట్ వచ్చాక  ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు.

సిట్ అధికారులకి నా దగ్గర ‌ఉన్న ఆధారాలు ఇచ్చాను. సిట్ అధికారులు నిజాయితీపరులు. కానీ పరిమితులు తక్కువగా ఉన్నాయి. కానీ ప్రభుత్వంపై నమ్మకం లేదు. ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణను సీబీఐకి అప్పగించండి. దాదాపు ఆరు వేలకు పైగా ఫోన్లు ట్యాపింగ్‌ అయ్యాయి. ప్రభాకర్ రావు ఐజీ అని తప్పుడు సమాచారం కేంద్రానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని ఆయనను విచారణకి పిలుస్తారా?. ఎస్‌ఐబీ దేని కొసం పనిచేయాలి.. కేవలం మావోయిస్టుల కోసం పని చేయాలి. మావోయిస్టు సానుభూతిపరులుగా మా పేర్లు పోలీసులకు పంపారు.  ఇలా ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తారా?. హరీష్‌ రావు, కవిత ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. వారిని కూడా విచారణకి పిలవాలి అని వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)