Breaking News

నారా లోకేష్‌పై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

Published on Thu, 01/23/2025 - 16:39

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మంత్రులు, టీడీపీ నేతల నారా లోకేష్‌( Nara Lokesh) భజన తారాస్థాయికి చేరింది. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, డిప్యూటీ సీఎం చేయాలంటూ పచ్చ నేతలు కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చంద్రబాబు తర్వాత లోకేషే వారసుడు.. చిన్నపిల్నాడి అడిగినా చెప్తాడంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించాడు.

కాగా, సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌ పలువురు మంత్రులు దావోస్‌ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సుల్లో టీడీపీ నేతలు మరోసారి లోకేష్‌ భజన ఎత్తుకున్నారు. తమ నాయకుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి టీజీ భరత్‌ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్‌ ముఖ్యమంత్రి లోకేష్‌ అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.

ఇదిలా ఉండగా.. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కామెంట్స్‌ చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు.

మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో మరోసారి కలకలం

ఇదీ చదవండి: దావోస్.. అంతా తుస్

మరోవైపు.. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే కామెంట్స్‌పై అటు జనసేన నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నాయకుడు కిరణ్‌ రాయల్‌.. తమకు పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు అ‍త్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం అంటూ కౌంటర్‌ కూడా ఇచ్చారు.

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)