Breaking News

అభ్యర్థులు లేకపోవడంతోనే పొత్తులకు వెంపర్లాట

Published on Thu, 04/06/2023 - 05:29

ఒంగోలు: ‘పవన్‌కళ్యాణ్‌ నిలకడలేని మనిషి. ఆయనకు ఒక సిద్ధాంతం, భావజాలం లేవు. ఆయన చేస్తున్న­ది రాజకీయంలా అనిపించడం లేదు. రాజకీయ వ్యభిచారంలా ఉంది’ అని రాష్ట్ర పురపాలక, పట్టణా­భివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. బుధవారం ఒంగోలులో ఆ­యన మీడియాతో మాట్లాడారు. పవన్‌కళ్యాణ్‌ ఒకవైపు బీజేపీతో అంటకాగుతూ.. మరోవైపు టీడీపీతో ఒప్పందంలో ఉంటారని విమర్శించారు.

ఆయన ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో కనీసం ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలన్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడం వల్లే టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని విమర్శించారు. ఇలాంటి వారు గుంపులు గుంపులుగా వచ్చినా.. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామన్నారు. తాము చేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై ఉన్న నమ్మకంతోనే గడప గడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నామని.. ప్రభుత్వం ద్వారా వారికి చేకూరిన లబ్ధిని వివరిస్తున్నామని తెలిపారు.

ఇంకా ఏమైనా సమస్యలుంటే.. వాటిని తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి.. యువతను చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు అండ్‌ కో.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో రూ.300 కోట్లకు పైగా సొమ్మును కాజేసిందని మండిపడ్డారు. 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)