Breaking News

వైఎస్‌ జగన్‌ను కలిసిన పలువురు నేతలు

Published on Wed, 06/19/2024 - 15:55

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం పలువురు నేతలు కలిశారు. వైఎస్‌ జగన్‌ కలిసిన వారిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఉదయం నుండి క్యాంప్ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అందరినీ కలిసిన వైఎస్‌ జగన్‌.. వారికి ధైర్యం చెప్పారు.

రేపు వైఎస్సార్‌సీపీ  విస్తృతస్థాయి సమావేశం
ఈ నెల 21న అసెంబ్లీ సమా­వేశాల దృష్ట్యా వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు వైఎస్‌ జగన్‌ కార్యక్రమాల్లో పలు మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈ నెల 22కు బదులుగా ఈ నెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది.

ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే పార్ల­మెంట్‌ నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్య­ర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశాని­ర్దేశం చేయనున్నారు. అలాగే జూన్‌ 19నాటి పులివెందుల పర్యటనను వైఎస్‌ జగన్‌ వాయిదా వేసుకున్నారు.

 

 

 

 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)