Breaking News

ఇందిరమ్మరాజ్యంలో ఎమర్జెన్సీ పాలన

Published on Fri, 03/22/2024 - 03:33

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మరాజ్యం తెస్తామంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ పాలనను గుర్తుకు తెస్తోందని బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం కన్వీనర్‌ మన్నె క్రిషాంక్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్లు సతీశ్‌రెడ్డి, జగన్‌ మోహన్‌రావు, దినేశ్‌ చౌదరితో కలిసి గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఫిర్యాదు మేరకు మాదాపూర్‌ పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా తన పాస్‌పోర్ట్, సెల్‌ఫోన్‌తోపాటు తన పీఆర్‌ఓ, పీఏ ఫోన్లను మొబైల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నా రని చెప్పారు. తమ ఫోన్లను సీఎం రేవంత్‌రెడ్డికి చేరవేసినట్లు తనకు అనుమానం కలుగుతుందన్నారు. తమ ఫోన్లను, పాస్‌పోర్ట్‌ను పోలీసులు కోర్టుకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. చిత్రపురి కాలనీలోనే రూ.3వేల కోట్ల మేర అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌ చేసిన ఆరోపణలను మాత్రమే తాను ప్రస్తావించానని పునరుద్ఘాటించారు.

చిత్రపురికాలనీ అక్ర మాలపై రేవంత్‌ ప్రభుత్వం విచారణ జరిపించాలని క్రిషాంక్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఉన్నత న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. చిత్రపురి సొసైటీకి చెందిన అనుముల మహనందరెడ్డి ఎవరో తెలియదని సీఎం రేవంత్‌ అంటున్నారని, ఆయనతో సీఎం దిగిన ఫొటోలు కూడా ఉన్నాయన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసినా అణచివేత చర్యలకు పాల్పడలేదన్నారు.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)