Breaking News

‘ప్రసంగాలతో గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ’

Published on Thu, 05/30/2024 - 14:29

ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలను మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీవ్రంగా ఖండిచారు. ప్రతిపక్షాలు, ఓ వర్గం ప్రజలపై ప్రధాని మోదీ చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని ఆఫీసు గౌరవాన్ని దిగజార్చాయి. ఇలా గౌరవాన్ని దిగజార్చిన తొలి ప్రధాని మోదీ అని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జూన్‌ 1న ఏడో విడత పోలింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పంజాబ్‌ ప్రజలకు లేఖ రాశారు.

‘‘ ప్రధాని మోదీ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి దేశ ప్రజల్లో విభజన తీసుకువచ్చే విద్వేశ వ్యాఖ్యలు. 2022 వరకు మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు.  మోదీ విధానాల వల్ల  గత పదేళ్లలో రైతులు ఆదాయం దారుణంగా తగ్గిపోయింది. రోజుకు జాతీయ సగటు  రైతు  ఆదాయం రూ.  27 ఉంటే, సగటు అప్పు మాత్రం రూ. 27 వేలు ఉంది. ఇందనం, ఎరువులు అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో  రైతుల ఆదాయం తగ్గిపోయింది. పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. జీఎస్టీ, నోట్ల రద్దు, కరోనాను సరిగా ఎదుర్కొకపోవటం వల్ల దేశం దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లింది. 

గ్రోత్‌ రేట్‌ కూడా పడిపోయింది. సుమారు 750 మంది రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో మృతి చెందారు. లాఠీలు, రబ్బరు బుల్లెట్లతోనే కాకుండా ప్రధాని మోదీ తన మాటలతో రైతులపై దాడి చేశారు. రైతులను ‘‘ఆందోళన జీవులు’’ అని అవమానించారు. తమను సంప్రదించకుండా చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు  చేయాలని రైతులు  కోరారు. గడిచిన పదేళ్లలో పంజాబ్‌, పంజాబ్‌ ప్రజలను బీజేపీ ప్రభుత్వం  తీవ్రంగా దూషించింది’’ అని మన్మోహన్  సింగ్‌ తెలిపారు.

ఏప్రిల్‌లో మోదీ రాజస్థాన్‌లోని ఎన్నికల ప్రచార ర్యాలీలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. దేశ సంపదను ఎక్కువ మంది పిల్లలు కనేవారికి పంచిపెడతారని అన్నారు. ముస్లీంలకు తొలి ప్రాధాన్యమని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్  వ్యాఖ్యానించినట్లు  కూడా  మోదీ ఆరోపణులు చేసిన విషయం తెలిసిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)