Breaking News

మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్‌ నెం.176 Vs 267.. అసలేంటివి?

Published on Fri, 07/21/2023 - 17:00

ఢిల్లీ: మణిపూర్ అంశంపై నేడు పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయగా కేంద్రం కూడా అందుకు సమ్మతించింది. కానీ రూల్‌ నెంబర్ 267 కింద మణిపూర్ అంశాన్ని చర్చించాలని ప్రతిపక్షాలు కోరగా.. కేంద్రం మాత్రం రూల్ నెంబర్ 176 కింద చర్చిస్తామని స్పష్టం చేసింది. మణిపూర్ అంశంపై అరగంట చర్చ సరిపోదని, రూల్ 267 కింద చర్చ జరపాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.

కేంద్రం ఇందుకు అంగీకరించడం లేదని ఆరోపించారు. అయితే.. ప్రతిపక్షాలు పదే పదే తమ నిర్ణయాన్ని మారుస్తున్నాయని కేంద్రం మంత్రి అర్జున్ రామ్‌ మేఘవాల్ అన్నారు. కేవలం ప్రధాని మోదీ వచ్చి ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాయని చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తి ప్రతిపక్షాలకు లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. అసలు ఈ రూల్‌ నెంబర్‌ 176, 267 రెండు నిబంధనల మధ్య ఉన్న తేడా ఏంటీ?

ఇదీ చదవండి: మణిపూర్‌ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటిని తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు

రూల్ 267 ప్రకారం..
రాజ్య సభ నిబంధనల ప్రకారం రూల్ 267కు ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మీద ప్రత్యేకంగా చర్చ జరపాలని సభ్యులు కోరవచ్చు. ఇందుకు ఆ రోజు సభలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఇతర సభ్యులు ఇచ్చిన నోటీసులు తాత్కాలికంగా రద్దు చేయాలని కోరుబడతాయి. ప్రత్యేక చర్చకు సభ్యుడు నోటీసు ఇస్తే.. స్పీకర్ అనుమతించాల్సి ఉంటుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాన్ని రాతపూర్వకంగా కానీ, ఓరల్‌గానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చర్చలో సభ్యులు ఏ అంశంపైనైనా అడగవచ్చు. 1990 నుంచి 2016 వరకు కేవలం 11 సార్లు మాత్రమే ఈ రూల్ కింద చర్చ జరిగింది. 

రూల్ 176 ప్రకారం..
ఈ రూల్‌ ప్రకారం చర్చ అరగంట నుంచి రెండున్నర గంటలపాటు మాత్రమే ఉంటుంది.  సభలోని ప్రతి సభ్యుడు ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశంపై చర్చించేందుకు నోటీసు ఇస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాయాల‍్సి ఉంటుంది. ఆ నోటీసుకు మద్దతుగా ఇద్దరు సభ్యులు సంతకాలు చేయాలి. ఈ నోటీసు ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలో లేదా మరుసటి రోజు స్పీకర్ పరిగణనలోకి తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: సుప్రీంలో రాహుల్‌ గాంధీ పిటిషన్‌.. పలువురికి నోటీసులు.. బెంచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)